మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )మహమ్మద్ నగర్ మండలంలోని సంగీతం గ్రామపంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారులకు సర్పంచ్ సయ్యద్ రఫీ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మహిళా సంఘాల అభివృద్ధి కోసం సమైక్య భవనానికి సింగీతం గ్రామంలో 10 లక్షల రూపాయలు మంజూరు చేయడంతో గురువారం సర్పంచ్ సయ్యద్ రఫీ ఓయ్ పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అభివృద్ధి కోసం అన్ని రకాల చర్యలు చేపడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సాయవ్వ, మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు తాటిపల్లి సరస్వతి గౌడ్, గ్రామ సమైక్య అధ్యక్షురాలు
శోభ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *