మన న్యూస్ పాచిపెంట,డిసెంబర్ 19: పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట గ్రామ పంచాయతీలలో అధికారులు,సిబ్బంది కలసి సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్లాలని పాచిపెంట ఎంపీపీ బి ప్రమీల హితవు పలికారు. గురువారం నాడు మండల పరిషత్తు సమావేశ భవనంలో ఎంపీడీవో బి జే పాత్రో అధ్యక్షతన సచివాలయం,పంచాయితీసిబ్బందికి శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ ప్రమీల మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి రూపొందించిన 9 ప్రధాన సూత్రాలను ఆమె వారికి తెలియజేశారు.1.పేదరికం లేని మెరుగైన జీవనోపాధి కలిగిన గ్రామం కావాలన్నారు. 2. ఆరోగ్యవంతమైన గ్రామము కావాలని కోరారు.3.బాలహిత గ్రామము,4.నీరు సమృద్ధిగా కలిగిన గ్రామము,5. పరిశుభ్రతతో పాటు పచ్చదనం కలిగిన గ్రామము,6. స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాలు కలిగిన గ్రామము.7. సామాజికంగా సుస్థిరమైన గ్రామము. 8.సుపరిపాలన కలిగిన గ్రామం, 9. మహిళా హిత గ్రామము కావాలని కోరారు. పై 9 లక్ష్యాలు ఆయా పంచాయతీల్లో కలిగిన అన్ని శాఖలతో సమన్వయంతో పరిపూర్ణంగా అమలుపరిచినట్లయితే పూర్తిస్థాయిలో ఆయా పంచాయతీలు అభివృద్ధి చెందుతాయని ఆమె ఆశా భావం వ్యక్తం చేశారు.అలాగే 2025-26 సంవత్సరాలుగాను ఆయా పంచాయతీల్లో ప్రణాళికలు తయారు చేసేవిధoగా రూపొందించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎంపీడీవో మాట్లాడుతూ మనమంతా కలిసికట్టుగా సమన్వయంతో గ్రామపంచాయతీలు అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలని మీరంతా సహకరించాలని ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరారు. జిల్లా అధికారుల ఆదేశానుసారం మనమంతా చక్కగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వారితోపాటు పంచాయతీ విస్తరణ అధికారి మల్లేశ్వరరావు, పలువురు సిబ్బంది తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *