మన ధ్యాస నెల్లూరు రూరల్,జూన్ 22 : నెల్లూరు రూరల్,బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండగ జూన్ 26 నుండి 5 రోజులపాటు జరుగుతుంది. ఈ సందర్భంగా ఫెస్టివల్ కమిటీ చైర్మన్గా మునీర్ భాష ను నియమించారు. ఫెస్టివల్ కమిటీ చైర్మన్ తో పాటు 110 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేశారు. కమిటీ మెంబర్గా షేక్ అబ్దుల్ జహీర్ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ,నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వక్స బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్, నగర మేయర్ దేవరకొండ సుజాత,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

