

మన న్యూస్: చిత్తూరు, డిసెంబర్ 16 తిరుపతి రోడ్ లోని మురకంబట్టు ఆర్ వి ఎస్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో ఐదు రోజులపాటు జరిగే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. అనంతపురం జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం,(జె ఎన్ టి యు ఏ) మరియు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ‘నావిగేటింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ఫార్మాసిటికల్ సైన్స్ ఎడ్యుకేషనల్ స్టేటజీస్ ఎక్సలెన్స్’అనే అంశంపై ఈ నెల 16 నుంచి 20 తేది వరకు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం జరగనుంది.ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి జ్యోతిశ్వరి ప్రారంభించి ఫార్మాస్యూటికల్ విద్యలో నిరంతరం అభివృద్ధి మరియు సృష్టి విధానాలపై ప్రస్తావించారు.అలాగే ప్రధాన అతిధి ప్రొఫెసర్ డాక్టర్ జి వి నాగేష్ కుమార్ విద్య యొక్క అభివృద్ధిలో సాంకేతిక యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు.విద్య పురోగతి జ్ఞానం పంచుకునే సహకార వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ సంస్థలకు చెందిన సిబ్బంది,వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాల సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.