వి .పి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్‌ మేళా గ్రాండ్‌ సక్సెస్‌

మన న్యూస్:నెల్లూరు నలుమూలల నుంచి భారీగా వచ్చిన యువత.800 మందికి స్పాట్‌ ఆఫర్‌ లెటర్లు అందించిన ఎమ్మెల్యే,షార్ట్‌లిస్ట్‌ అయిన 1700 మందికి త్వరలో ఆఫర్‌ లెటర్లు ఉద్యోగాలు కల్పించడంపై యువత హర్షం. వేమిరెడ్డి దంపతులకు ధన్యవాదాలు తెలిపిన యువతీయువకులు.త్వరలో మరిన్ని జాబ్‌ మేళాలు నిర్వహించి నిరుద్యోగరహిత జిల్లాను తీర్చిదిద్దుతాం వి పి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో
మెగా జాబ్‌ మేళాను ఆదివారం ఘనంగా నిర్వహించి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అన్నారు. మెగా జాబ్ మేళాకు హాజరై విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ వారు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ మెగా జాబ్‌ మేళాకు దాదాపు 8000 మంది హాజరు కాగా.దాదాపు 2500 మంది ఎంపికయినట్లు తెలిపారు.ఇందులో స్పాట్‌లోనే 800 మందికి ఆఫర్‌ లెటర్లు అందించారు మిగతా వారికి సోమవారం అందించనున్నట్లు వివరించారు.ఈ మెగా జాబ్ మేళా ముగింపు వేడుకల్లో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తో పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌ ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాలు పొందిన వారు ఆనందంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులతో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వారి వారి విద్యార్హతలు తగ్గ ఉద్యోగం రావాలని కోరుకుంటున్నానన్నారు. మూడు నెలలకు ముందు నిర్వహించిన జాబ్ మేళాలో దాదాపు వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు దక్కాయన్నారు ఇప్పుడు 2500 మందికి ఉద్యోగాలు దక్కాయన్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా చేసే సామాజిక సేవలో భాగంగా నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నది ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆశయమన్నారు. డిప్యూటీ మేయర్‌ రూప్‌ కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ ఇలాంటి ఎంపీ, ఎమ్మెల్యే దొరకడం అదృష్టమన్నారు.ఇంతపెద్ద ఈవెంట్‌ను అంతా తానై నడిపించిన అర్జున్‌రెడ్డికి, నీలిమాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ జిల్లావాసులకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో వేమిరెడ్డి దంపతులు కృషి చేస్తున్నారని వివరించారు. అనంతరం వివిధ కంపెనీలకు ఉద్యోగాలకు ఎంపికైనవారికి వేమిరెడ్డి దంపతుల చేతులమీదుగా 800 మందికి ఆఫర్‌ లెటర్స్‌ అందించారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..