

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: స్థానిక సాయి శంకర్ నేత్రాలయ ఆవరణలో ఏలేశ్వరం లయన్స్ క్లబ్, కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో 200 మంది దృష్టిలోపం ఉన్నవారికి సేవలు అందించారు. ఈ శిబిరాన్ని ప్రకృతి పరిరక్షణ సంఘం అధ్యక్షులు డాక్టర్ సఖిరెడ్డి విజయబాబు ప్రారంభించారు. ఈ శిబిరంలో ప్రముఖ నేత్ర వైద్యులు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ అనసూరి నాగేశ్వరరావు, కిరణ్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అవని, డాక్టర్ వెంకట అనూష 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు కళ్ళజోళ్ళు అందజేశారు. వీరిలో 30 మందికి ఐ ఓ ఎల్ ఆపరేషన్ నిమిత్తం కాకినాడ కిరణ్ ఆసుపత్రికి తరలించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు జ్యోతుల నాగ సత్య శ్రీనివాస్, అలమండ దుర్గాప్రసాద్, కప్పల నాగభూషణం, గొల్లపూడి గణేష్, జామి సూర్య ప్రకాష్, తాండూరి రాము, తాళ్లూరి గొల్లాజిరావు తదితరులు ఉన్నారు.