మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి,గున్కుల్ గ్రామంలో గురువారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఘనంగా గ్రామ సభ నిర్వహించబడింది.గ్రామ సర్పంచ్ గంగి రమేష్, బోయిని హరిన్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించగా, గ్రామసభ సభ్యులు వాటిని ఆమోదించారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళికకు ప్రత్యేక అధికారిగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ పండరీ,ఏఈవో మధుసూదన్ హాజరై, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలను అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని, గ్రామ ప్రజల సమస్యలపై స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.గ్రామ సర్పంచ్ గంగి రమేష్ మాట్లాడుతూ..ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ద్వారా గ్రామ అభివృద్ధి, శ్రేయస్సు కోసం నిత్యనూతన కార్యక్రమాలను చేపడుతున్నాం. గ్రామ అభివృద్ధి, పారిశుద్ధ్యం,ప్రతి ఇంటికి తగినంత నీరు, ఇంధిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్లు, ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించడంలో ప్రభుత్వం ప్రధానంగా కృషి చేస్తోంది. వీటితో గ్రామస్థుల జీవనోన్నతి, ఆరోగ్యం మెరుగుపడుతుంది, అన్నారు. అతను అభివృద్ధిపై గ్రామ అభివృద్ధి ప్రజలతో కలిసి సాధించగల లక్ష్యం ప్రతి కార్యక్రమం ద్వారా మనం గ్రామాన్ని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దడానికి కృషిచేస్తున్నాం.సర్పంచ్ హరిన్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామంలో నీటి సమస్య, మురికి కాలువలు, తదితర రకాల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. గ్రామంలో యువనే సమస్యలు ఉంటే సర్పంచ్ దృష్టికి తీసుకువస్తే సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు శిరీష ,చాకలి అంజయ్య,జిపిఓ వినోద్, ఉపసర్పంచ్ సాయ గౌడ్, నాయకులు వెంకట్ రాములు, వెంక గౌడ్ ,మంగలి చిన్న రాములు, హెల్త్ సూపర్వైజర్ సులోచన, ఉపాధ్యాయులు సాయి రెడ్డి,
సభలో వ్యవసాయ, రెవెన్యూ, ఆరోగ్య శాఖలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *