మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) రైతును రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని డిసిసి జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అన్నారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట సొసైటీ ఆధ్వర్యంలో అచ్చంపేట గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని డిసిసి జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కొనుగోలు కేంద్రం కాంటాకు పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరతో పాటు బోనస్ ను పొందాలని ఆయన సూచించారు. అలాగే ఏ గ్రేడ్ వరి ధాన్యానికి క్వింటాల్ కు రూ. 2389, బీ గ్రేడ్ కు రూ.2369 మద్దతు ధర ప్రకటించినట్లు వెల్లడించారు.సన్న రకం ధాన్యానికి అదనంగా క్వింటాల్కు రూ. 500 బోనస్ అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు మధ్యవర్తులను నమ్మకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే తమ ధాన్యాన్ని తీసుకురావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి మంద బలరాం, సర్పంచ్ సంకు లక్ష్మయ్య, సీఈవో సంగమేశ్వర్ గౌడ్, నాయకులు బంగ్లా ప్రవీణ్ కుమార్, చాకలి రమేష్, గుమస్తా శ్రీనివాస్, మంగలి ఎల్లయ్య, రాములు, అలాగే పలువురు రైతులు, ప్రాథమిక సహకార సంఘం సిబ్బంది పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *