మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):
నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం టీకాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశువులకు అవసరమైన టీకాలను పశువైద్య సిబ్బంది సమగ్రంగా అందించి, రైతులకు పశుసంరక్షణపై అవగాహన కల్పించారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, మండల పశువైద్యాధికారి శ్రుతిలయ, సర్పంచ్ బొజ్జ అంజయ్యలు కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ పశువుల ఆరోగ్యం రైతుల ఆర్థికాభివృద్ధికి అత్యంత కీలకమని తెలిపారు. పశువులు ఆరోగ్యంగా ఉంటేనే రైతులకు మెరుగైన ఆదాయం లభిస్తుందని, అందుకే ఇలాంటి టీకాల కార్యక్రమాలను తరచూ నిర్వహించడం అవసరమని అన్నారు. రైతులు తమ పశువులకు సమయానికి టీకాలు వేయించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ప్రజా పండరి, మెంగారం శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్లు వెంకట్ రాంరెడ్డి, రాజారాం, ప్రభాకర్ రావు, నజీర్, గోపాలమిత్రలు నందు, సిద్దు, రఘు, హకీమ్, కిరణ్, ఏఎంసీ సిబ్బంది బాల్‌రాజ్ గౌడ్, సాయగౌడ్, పండరి తదితరులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *