

మన న్యూస్: కరకగూడెం, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న ఆశ్రమ పాఠశాలలన్నింటిలోనూ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహింపబడుతున్నటువంటి ప్రతి ఆశ్రమ పాఠశాలలో కొత్త మెనుని పాటించే అంశం విషయంలో శనివారం కరకగూడెం మండలంలోని ఆశ్రమ హై స్కూల్ చిరుమళ్ళ పాఠశాలలో కూడా కొత్త మెనూని లాంచ్ చేసే ఓరియంటేషన్ ప్రోగ్రాం నీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరినీ పాఠశాలకు పిలిచి కొత్త మెనూ యొక్క వివరాలను తెలిపి విద్యార్థులకు అందించేటటువంటి సౌకర్యాల ను పాఠశాలలో ఉన్నటువంటి అన్ని వసతుల గురించి తెలియపరచడమే కాకుండా వారి పిల్లలను ఆశ్రమ పాఠశాలలో చేర్పించడానికి కృషి చేయాలని విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం పాటుపడాలని విద్యార్థుల తల్లిదండ్రులు అందరిని కూడా పిలిచి మెనూని పూర్తిగా చెక్ చేసి అందరూ కూడా పాఠశాలలోనే భోజనం చేసే విధంగా భోజనాలు ఏర్పాటు చేయడంతో పాటు మిగతా విషయాలన్నిట్లో కూడా విద్యార్థుల తల్లిదండ్రులతో పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయులతో పాటు డిప్యూటీ వార్డెన్ మిగతా టీచర్ లందరూ కూడా వారితో పేరెంట్స్ మీటింగ్ కండెక్ట్ చేయడం కూడా జరిగింది ఈ యొక్క కొత్త మేనూ యొక్క ఓరియంటేషన్ ప్రోగ్రాం ఇనాగరేషన్ లో భాగంగా ముఖ్య అతిథులుగా కరకగూడెం ఎంపీడీవో , ఎమ్మార్వో ఎంఈఓ, గ్రామ పెద్దలు గ్రామస్తులు అనేకమంది పాల్గొనడం తో పాటు అందరితో పాటు సహపంక్తి భోజనం కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏహెచ్ఎస్ కరకగూడెం పాఠశాల హెచ్ఎం డి.నాగేశ్వర రావు, వార్డెన్ బి.శేఖర్, ఉపాధ్యాయులు గంగరాజు, సాయన్న,రామచంద్ర రావు,లింబ్య,సత్యనారాయణ,జనార్దన్,సరోజినీ, శ్రీనివాసరావు,బాలరాజు, నాగేశ్వర రావు,బాలాజీ తదితరులు పాల్గొన్నారు.