చిత్తూరు,మనధ్యాస, మే25 రిపోర్టర్ కమల్ రెడ్డి
2026 సంవత్సరం మామిడి సీజన్ ప్రారంభమై మే నెల ముగుస్తున్న ఇంతవరకు చాలావరకు గుజ్జు పరిశ్రమలు ప్రారంభించలేదని మరియు ధరలు నిర్ణయించలేదని ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోలేదని చిత్తూరు జిల్లా మామిడి రైతు సంఘం అధ్యక్షుడు సి. మునీశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.గతంలో చిత్తూరు జిల్లా మామిడి రైతు సంఘం తరఫున చిత్తూరు జిల్లా కలెక్టర్ కి 12 డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది అందులో ప్రధానంగా 1.2026 సంవత్సరం మే నెలలోనే ప్రభుత్వం గుజ్జు ఫ్యాక్టరీలు తెరిపించాలని2. మామిడి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని 3. జిల్లా స్థాయి అధికారులతో పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని4.ఉపాధి హామీని మామిడి రైతుకు అనుసంధానం చేయాలని5.క్రిమిసంహారక మందులు 50% శాతం సబ్సిడీతో ఇవ్వాలని6. మామిడి రైతు బజార్లు ఏర్పాటు చేయాలని 7.మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలనిఇంకా చాలా విషయాలపై నివేదించడం జరిగింది. ఈ సంవత్సరం సీజన్ ప్రారంభమైన ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఆశించిన స్థాయిలో ఆ దిశగా చర్యలు తీసుకోలేదుకాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని మామిడి సంఘం ఇచ్చిన అభ్యర్థనను పరిశీలించి వాటిపై చర్యలు తీసుకొని మామిడి రైతులకు ఈ సంవత్సరమైనా గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.గత 2025 సంవత్సరం మామిడి ధరలు లేక గత సంవత్సరం రైతులు సప్లై చేసిన మామిడికాయలకు కొన్ని ఫ్యాక్టరీలు ఇప్పటికీ డబ్బులు చెల్లించక మామిడి రైతులు నష్టపోతున్నారు. గత సంవత్సరం ప్రభుత్వం ఇచ్చిన లిఖిత పూర్వక ఆదేశం ప్రకారం జిల్లాలో ఏ ఒక్క ఫ్యాక్టరీ కూడా రైతులకు 8 రూపాయలు చెల్లించలేదు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం గుజ్జు పరిశ్రమలు రైతులకి డబ్బులు చెల్లించకపోతే ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని రైతులు ఆవేదన చెందుతున్నారు.ఈ సంవత్సరము ఐనా మామిడి ధరలు బాగుంటాయని ఆశించిన రైతులు పెట్టుబడి పెట్టలేక చాలామంది రైతులు పెట్టిన ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయారుప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకొని రాలిన మామిడికాయలు రైతులు వ్యాపారుల వద్దకు తీసుకెళ్తే 1 రూపాయి మరియు 2 రూపాయలకు అమ్ముకోలేక రోడ్డుపైన మరియు మామిడి తోటలోనే వదిలి వేయడం జరిగింది కావున ప్రభుత్వం చర్యలు తీసుకొని నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందించి మామిడి రైతులను ఆదుకోవాలని జిల్లా ప్రధాన కార్యదర్శి బంగారు మురళి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.