మన థాస, విడవలూరు, మార్చి 12 :ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజల గుండె చప్పుడు విని ప్రజావసరాలు తీర్చే పాలకుడని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో 60 వేల లీటర్ల కెపాసిటీతో 40 లక్షల రూపాయలు జల్ జీవన్ నిధులతో నిర్మించిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, 33 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లు, డ్రైన్లు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ…. ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాలలోనికి వచ్చిన తాను ప్రజా సమస్యల పరిష్కారమే ధేయంగా పని చేస్తున్నట్టు తెలిపారు. గత పాలకులు గ్రావెల్ తవ్వుకొని సొమ్ముచేసుకునే పనిలో పడి అభివృద్ధిని విస్మరించారనన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు తాగునీటి కొరత, శ్మశానాలు, రోడ్లు డ్రైన్లు లాంటి సమస్యలను తన దృష్టికి తెచ్చారని స్థానిక సమస్యలను తన దృష్టికి తెచ్చారని స్థానిక సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పంచాయతీ రాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ఒక్క విడవలూరు మండలంలోనే 6 కోట్ల 75 లక్షలతో గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. విడవలూరు మండల పరిధిలోని గ్రామీణ ప్రాంతాలలో వైద్య సదుపాయాల కోసం 2 కోట్ల 49 లక్షలతో 7 విలేజ్ హెల్త్ క్లినిక్స్ మంజూరయ్యాయని వాటిలో కొన్ని నిర్మాణాలు పూర్తికాగా, మరికొన్ని పురోగతిలో వున్నాయన్నారు. 4 కోట్ల 26 లక్షల రూపాయలతో మండల వ్యాప్తంగా గ్రామాలలో రోడ్లు డ్రైన్లు నిర్మించుకున్నాం. విడవలూరు మండలలో రోడ్లు, డ్రైన్ల నిర్మాణం కోసం తమ ఎంపి లాడ్స్ ద్వారా 55 లక్షల అందించిన ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనలో అమలైన పెన్షన్ల పెంపు, ఏడాదికి ఉచితంగా 3 సిలెండర్లు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు తదితర పధకాల ద్వారా పేదలకు జరిగిన లబ్దిని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రజలకు వివరించారు. గత ప్రభుత్వం అస్తవ్యస్త నిర్ణయాల కారణంగా పేదలకు ఇంటి స్థలాలు, పక్కా ఇళ్ళు మంజూరులో జాప్యం జరుగుతుందన్నారు. త్వరలో ప్రభత్వం కొత్త పెన్షన్లు మరియు పక్కా ఇళ్ల మంజూరు కార్యమాన్ని చేపడుతుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో 8 కోట్ల 50 లక్షలతో జరుగుతున్న బుచ్చి – ఊటుకూరు రోడ్డు నిర్మాణ పనులతో పాటు 3.5 కోట్లతో మంజూరై వున్న ఇనుమడుగు – ముదవర్తి, 1 కోటి రూపాయలతో వేగూర – పార్లపల్లి, మరో 1 కోటి రూపాయలతో విడవలూరు – తుమ్మల గుంట మరియు 60 లక్షలతో పొన్నపూడి – రామతీర్ధం, 42 లక్షలతో వావిళ్ల రోడ్డు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. స్త్రీనిధి పధకంలో భాగంగా 120 మంది సభ్యులుగా వున్న రెండు పొదుపు సంఘాలకు మంజూరైన 1 కోటి 20 లక్షల చెక్కును ఎమ్మెల్య్యే ప్రశాంతి రెడ్డి గారు మహిళలకు సంధించారు. అనంతరం స్థానిక గిరిజన కాలనీలో 9 వార్డు పంచాయతీ సభ్యురాలు గడ్డం రమణమ్మ ఇంటికి వెళ్లి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యకరంలో గ్రామీణ నీటి సంస్థ, పంచాయతీ రాజ్, ఎలక్ట్రిసిటీ తదితర శాఖలకు చెందిన మండల అధికారులు మరియు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







