మన ధ్యాస,నెల్లూరు,మార్చి5 :నెల్లూరు నగరంలోని డైకాస్ రోడ్డు, గౌతమ్ రెడ్డి విగ్రహం దగ్గర గురువారం శ్రీ నవ్య హాస్పిటల్ ను 28వ డివిజన్ కార్పొరేటర్ చెక్కా అహల్య సాయి సునీల్ ప్రారంభించినారు. చిల్డ్రెన్స్, మదర్ కేర్ డాక్టర్ నవ్య బుడ్డిగ (స్త్రీ మరియు ప్రసూతి వైద్య నిపుణుల) మరియు డాక్టర్ శ్రీధర్ గండికోట( శిశు మరియు చిన్నపిల్లల వైద్య నిపుణులు) చెన్నై నగరాలకు వెళ్ళవలసిన అవసరం లేనటువంటి, అత్యాధునిక వసతులతో, పరికరాలతో కూడిన శ్రీ నవ్య హాస్పిటల్, చిల్డ్రన్స్ మదర్ కేర్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ నవ్య బుడ్డిగ స్త్రీ మరియు ప్రసూతి వైద్య నిపుణులు మాట్లాడుతూ……. ఎంతో అనుభవం కలిగిన, అత్యాధునిక వసతులతో కూడిన మా నవ్య హాస్పిటల్ నందు, సాధారణ మరియు సిజేరియన్ కాన్పులు, హైరిస్ ప్రెగ్నెన్సీ వంటి కేసులను చెన్నై నగరాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా, మా నవ్య హాస్పిటల్ నందు అత్యుత్తమ సేవలు అందుబాటులో ఉన్నాయని, నెలసరి ఇబ్బందులు, గర్భాశయంలో, అండాశయంలో గడ్డలు, గర్భసంచి జారడం, ఉమ్మనీరు తక్కువగా ఉండటం, ఉమ్మనీరు పోవడం, హార్మోన్ సమస్యలు, పెద్ద వయసులో వచ్చే అనారోగ్య సమస్యలకు, సంతానలేని సమస్యలకు, లాప్రోస్కోపీ హిస్టరోస్కోపి వంటి ఫెర్టిలిటీ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. అదేవిధంగా చిన్నపిల్లల విభాగానికి, ఎంతో అనుభవం ఉన్న డాక్టర్ శ్రీధర్ గండికోట శిశు మరియు చిన్నపిల్లల వైద్య నిపుణులు చిన్న పిల్లల వ్యాధులు, చిన్నపిల్లల ఎదుగుదల లోపాలు, అన్ని రకముల జ్వరములు, పుట్టిన పిల్లలకు వచ్చే కామెర్లు వంటి పిల్లల సమస్యలకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. పుట్టిన పిల్లల నుండి 18 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు అన్ని రకముల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని ఆమె తెలియజేశారు. సింహపురి ప్రజలు హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకు చెన్నై నగరాలకు వెళ్ళవలసిన అవసరం లేదని, శ్రీ నవ్య హాస్పిటల్ నందు 24 గంటలు అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. కావున నెల్లూరు నగర ప్రజలు ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ చెన్నై నగరాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా, అన్ని చికిత్సలకు మా శ్రీ నవ్య హాస్పిటల్ నందు అధునాతన వైద్యం అందుబాటులో ఉందన్నారు. ఈ కార్యక్రమానికి చేసిన ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకులకు, మిత్రులు ,శ్రేయోభిలాషులకు శ్రీ నవ్య హాస్పిటల్ తరఫునుంచి ప్రత్యేక ధన్యవాదాలు హాస్పిటల్ నిర్వాహకులు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *