మన ధ్యాస,నెల్లూరు,మార్చి 5 :నెల్లూరు నగరంలోని రామలింగాపురం మెయిన్ రోడ్ నందు గురువారం ఉదయం టిడిపి నాయకులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా భగవాన్ మెడికల్ షాప్ ఘనంగా ప్రారంభమైంది, ఈ సందర్భంగా నూకరాజు మదన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…..భగవాన్ మెడికల్ షాప్ నిర్వాహకులు పి హరి కృష్ణ కి శుభాకాంక్షలు తెలియజేశారు. నెల్లూరు నగరంలోని రామలింగాపురం మెయిన్ రోడ్ లో భగవాన్ మెడికల్ షాప్ నందు సింహపురి ప్రజలకు మంచి డిస్కౌంట్ తో కూడిన అన్ని రకాల మందులను అందుబాటులోనికి తీసుకురావడం జరిగిందని, లాంగ్ ఎక్స్పరిటి కలిగిన మంచి మందులను, ఎక్కడ దొరకని మందులు వీళ్ళ దగ్గర లభిస్తాయని, బయట ప్రాంతాల నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల మందులను భగవాన్ మెడికల్స్ నందు లభ్యమవుతున్నాయని, ప్రభుత్వం సూచించిన నియమ, నిబంధనలను పాటిస్తూ, మెడికల్ వ్యాపార రంగంలో అనుభవం కలిగిన వ్యక్తి హరి కృష్ణ అని తెలిపారు. కావున సింహపురి ప్రజలు మీకు అవసరమైన మందుల కొరకు రామలింగాపురంలోని హరి కృష్ణ మెడికల్ షాప్ ను సందర్శించి వారి యొక్క సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. అలాగే హరి కృష్ణ ఇటువంటి బ్రాంచీలు మరెన్నో నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసి నెల్లూరు నగర ప్రజలకు ఎన్నో సేవలు అందించాలని మంచి మందులను ప్రజలకు అందజేసి వారి మన్ననలు పొందాలని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *