
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:వైసిపి ప్రభుత్వం వైజాగ్ ఫ్యాక్టరీలో చనిపోయిన వారికి కోటి రూపాయలు ఇస్తే కూటమి ప్రభుత్వం 20 లక్షలు ఇవ్వడం దారుణం అన్నారు.చేతులుకాలిక ఆకులు పట్టుకున్నట్టు సామెతగా ఉంది. వేటలపాలెం లో ప్రభుత్వ అధికారులు బాణసంచా కేంద్రాలకు.ఏటువంటి
షరతులు జాగ్రత్తలు లేకుండా.పర్మిషన్ ఇవ్వడం. బాణసంచ పరిశ్రమలో పేలడం సదా మామూలే దీనికి పూర్తి బాధ్యత రాష్ట్రప్రభుత్వాన్నిదే అన్నారు.కాకినాడ జిల్లాలో వేట్లపాలెం రాయవరం ప్రాంతంలో అనధికారికంగా
చాలా ఉన్నాయి. ఇప్పటికీ కాకినాడ జిల్లాలో రాయవరం సంఘటన కలుపుకొనినాలుగు ప్రాంతాలలో ప్రమాదాలు జరిగి ఉన్నాయి ఇప్పుడు వేట్లపాలెం లో భారీ ఎత్తున పేదలు దళితులు మృత్యువాత పడి శవాలు కాలిపోయి గుర్తుపట్టలేనటువంటిపరిస్థితిలో ఉన్నారు బాణసంచా పరిశ్రమలో ప్రమాదమైన తయారీ గోడౌన్స్ అన్ని
ప్రభుత్వానికి తెలుసు కానీ కొంతమంది రాజకీయ పార్టీ అండ దండలతో. పూర్తి పర్మిషన్ లేకుండా చాలా పరిశ్రమలు నడుస్తున్నాయి దీనిని అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం వారికి ముడుపులు అందడంతో బాణసంచ పరిశ్రమవ్యాపారస్తులు విచ్చలవిడిగా వ్యాపారం కొనసాగించడమే. ప్రజల శవాలుగా మారడం కారణం రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటే గత ప్రభుత్వంలో. వైజాగ్ ప్రాంతంలో ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగితే.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది.కానీ 20 లక్షలు ఇచ్చి
చేతులుదులుపుకున్నరు.తెలుగుదేశం కూటమి ప్రభుత్వం
ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూడవలసిన
బాధ్యత ఉంది.కానీ సంఘటన జరిగినప్పుడు అందరూ
చాలా దారుణం ఇటువంటి పరిశ్రమలుఉండకూడదు అని అంటారు అధికారులు రాష్ట్ర ప్రభుత్వంకొద్ది రోజులకే మరసిపోతుంది.చనిపోయిన
23 కుటుంబాలకు న్యాయం చేయాలంటు బాధిత కుటుంబాలకు లో ఒక్కొక్కరికి కోటి రూపాయలు ప్రభుత్వ ఉద్యోగం,పిల్లలకు విద్యాభ్యాసం బాధిత కుటుంబాలకు గృహ నిర్మాణం ఇచ్చి ఆదుకోవాలని సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా.ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి
కోసిరెడ్డి గణేష్ రావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐఎంఎల్. వినోద్ మిశ్రా పార్టీ ఏలేశ్వరం మండల కార్యదర్శి గండేటి నాగమణి,
సహాయ కార్యదర్శి కందుల ప్రసాద్,గునాపు వరలక్ష్మి, పలప సుందరి, మశెరపు రాజారావు, కందుల వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.