మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు:బాలిక అదృశ్యమైందని తల్లితండ్రుల ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన 8 గంటల్లోనే ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మీకాంతం అదృశ్యమైన బాలిక ఆచూకీని గుర్తించి తల్లిదండ్రులకు అప్పజెప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకోవడమే కాకుండా, ప్రత్తిపాడు ఎస్ఐ లక్ష్మీకాంతంతో పాటు పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందిస్తున్నారు.దీనికి సంబంధించి ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మీకాంతం తెలిపిన వివరాలు ప్రకారం శుక్రవారం రాత్రి 9.30 సమయంలో ప్రత్తిపాడు గ్రామానికి చెందిన 17 సం.ల బాలిక ఇంటి నుండి ఎక్కడికో వెళ్ళిపోవడంతో కనబడట్లేదని బాలిక తల్లిదండ్రులు ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు.దీంతో ప్రత్తిపాడుఎస్సై లక్ష్మీకాంతం బాలిక అదృశ్యం కేసుగా నమోదు చేసి,ఆ బాలిక అదృశ్యం కేసులో ప్రత్తిపాడు సిఐ బిఎస్ అప్పారావు పర్యవేక్షణలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి,ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు.అత్యాధునిక టెక్నాలజీ ద్వారా కేవలం 8 గంటల వ్యవధిలో అదృశ్యమైన బాలిక ఆచూకిని గుర్తించి,ఆమెను క్షేమమంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.దీంతో ప్రత్తిపాడు ఎస్సై ఎస్ లక్ష్మి కాంతంతో పాటు వారి సిబ్బందిని ఉన్నతా ధికారులు అభినందించారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *