మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:కోనసీమ జిల్లా అమలాపురం రావులపాలెం పరిసర ప్రాంతాల నుంచి తాబేళ్లను రహస్యంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠాను . కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న తాబేలును ఫారెస్ట్ అధికారులు కు అందిన సమాచారం మేరకు శుక్రవారం రాత్రి జరిపిన వాహన తనిఖీల్లో బొలెరో వాహనంలో 30 బస్తాల్లో సుమారు 500 తాబేళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తాబేళ్లను రవాణా చేస్తుండగా వాహనాలతో సహా ఇద్దరు వ్యక్తులను ఏలేశ్వరం అటవీ శాఖ కార్యాలయం తరలించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ కె దుర్గా రాంప్రసాద్ మాట్లాడుతూ డి ఎఫ్ ఓ రామచంద్ర రావు కి రాబడిన ముందస్తు సమాచారం మేరకు,ఏలేశ్వరం రేంజ్ అధికారులు తాంబేలు తరలిస్తున్న బొలెరో వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు.రావులపాలెం, అమలాపురం పరిశ్రమ ప్రాంతాల నుండి సేకరించిన తాబేలును ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ ప్రాంతాల్లో అధిక దార్లకు విక్రయిస్తున్నారు. తాబేళ్ల మాంసానికి గిరాకీ ఉండటంతో వీటికి డిమాండ్ పెరిగింది. ఈ తాంబేలను అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకున్నట్టు వారి పై 1972 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి ప్రత్తిపాడు కోర్టుకు తరలించారు వైన్య ప్రాణ సంరక్షణ చట్టం ఎవరు అతిక్రమించిన కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పట్టుకున్న తాబేలును స్థానిక ఏలేరు జలాశయంలో తాబేళ్లను విడిచిపెడతామని అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *