మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామంలో ఐసిడిఎస్ సిడిపిఓ పద్మావతి సూచనలతో బాల్య వివాహలు నిర్మూలన దిశగా చేపట్టిన అవగాహన సమావేశము నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సర్పంచ్ బీసెట్టి అప్పలరాజు, ఐసిడిఎస్ సూపర్వైజర్ జి చక్రవేణి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ముక్త భారత్ 100 రోజులకార్యక్రమంలో భాగంగా యర్రవరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలొ ముందుగా బాల్యవివాహాల నిర్మూలల ప్రతిజ్ఞను చేపట్టారు. బాల్య వివాహాలు నిర్మూలించే దిశగా గ్రామంలో కమిటీని ఏర్పాటు చేశారు.
అనంతరం గ్రామంలో బాల్య వివాహం దిశగాఆలోచించే కుటుంబాన్ని కలిసి వారికి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బీశెట్టి అప్పలరాజు సూపర్వైజర్ చక్రవేణి మాట్లాడుతూ బాల్య వివాహల నిర్మూలన కమిటీ సభ్యులకు ముందుగా అభినందనలు తెలిపారు. గ్రామంలో బాల్య వివాహ నిర్మూలన దిశగా ఈ కమిటీ పని చేయాలని వారు కోరారు.
బాల్యవివాహాల వల్ల ముఖ్యంగా మహిళలు అనారోగ్యం గురవుతారని, అన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు ప్రజలకు తెలిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ టీచర్స్, ఎస్ ఎల్ వి నాగమణి, టి అనంతలక్ష్మి, ఎన్ అమ్మాజి, ఎమ్ జ్యోతి, పి చంద్రావతి, కే బుజ్జమ్మ, సచివాలయ సిబ్బంది, ఆరోగ్య,ఆశ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *