మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సర్వేలు అధికారులకు ప్రాణ సంకటంగా మారాయని గ్రామ రెవెన్యూ అధికారులు వాపోతున్నారు. రాష్ట్ర అమరావతి జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు గత నాలుగు రోజులుగా ఏలేశ్వరం తాసిల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు గురువారం నాటికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ ధర్నా కార్యక్రమంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వే ఈ సర్వేలో భాగంగా విధులు నిర్వహించే తమ గ్రామం తో పాటు ఆయా మండలాల్లో సర్వే జరుగుతున్న తమ గ్రామాలకు గ్రామ రెవిన్యూ అధికారులను సర్వే పూర్తయ్యే వరకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు ఉత్తర్వులు మేరకు అక్కడ విధులు నిర్వహించ నున్నారు. స్వమిత్వ సర్వేలో కూడా గ్రామ రెవెన్యూ అధికారులు విధిగా పాల్గొనవలసిందిగా జిఎస్డబ్ల్యూఎస్ అధికారులు ఇటీవల అదేశాలు ఇచ్చి ఉన్నారు. సుమోటో క్యాస్ట్ సర్టిఫికట్లు ఎంక్వయిరీ , నిర్ధారణ చేసే బాధ్యత గ్రామ రెవెన్యూ అధికారులు అటెండ్ అవ్వాలి. పంట నమోదు ప్రక్రియలో ప్రతి సర్వే నెంబరు రైతు ఏ పంట సాగు చేస్తున్నాడు అనే వివరాలతో అకల్పర్ అసిస్టెంట్ నుండి వచ్చు డేటాను ఖరీఫ్ రబీ రెండు పర్యాయాలు వీఆర్వో లాగిన్ నందు ద్రువీకరించి ఫార్వర్డ్ చేయవలసి ఉన్నది. ప్రతి సంవత్సరం కౌలు రైతులకు సి సి ఆర్ సి కార్డులు డేటా ఎంట్రీ , పత్రాలు మంజూరు,ప్రతీ సంవత్సరం రెండు పర్యాయాలు ఖరీఫ్ , నీటితీరువా పన్ను డేలా ఎంబ్లీ రైతు వారి డిమాండ్ ను తయారు చేయాలి, పన్ను వసూలు సచివాలయం నందు రైతులు నేరుగా డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ లో పే చేయవలసి ఉండగా, రైతులు సకాలంలో నీటితీరువా చెల్లించని కారణంగా నీటి తీరువా దిసూళ్లలో ఉన్నతాధికారుల నుండి ఇచ్చు టార్గెట్ల కారణంగా వీఆర్ఎల సహకారంతో విఆర్వోలు రైతుల ఇళ్లకు వెళ్లి నీటి తీరువా సచివాలయంలో చెల్లించవలసిందిగా వారిని మోటివేట్ చేయవలసి బాధ్యత ఉంది. అలాగే ప్రతి సంవత్సరం ఖరీఫ్, రబీ సీజన్లో రైతులు పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసి విషయంలో ప్రతి రైస్ మిల్లు వద్ద విఆర్వోలను కస్టోడియన్ ఆఫీసర్లుగా నియమించుచున్నారు.ప్రతి పూర్తిగా రెండు నెలలు ఆ విధులు నిర్వహించాల్సి ఉండగా అదే సమయంలో వేరే విదులు కూడా నిర్వహించవలసిన పరిస్థితులు లో సమయానికి ఆ రైస్ మిల్లు వద్ద వీఆర్వో లేని సందర్భంలో జిల్లా ఉన్నతాధికారుల యొక్క క్రమ శిక్షణ చర్యలకు గురికావాల్సి వస్తుంది.నిత్యం రోజు వారి విధుల్లో భాగంగా కులం, ఆదాయ సిఎంసి1950, ముటిషన్ ఫైల్స్ ఎంక్వయిరీ నిర్వహణ రిపోర్టు సబ్మిట్ చేయుట కార్యాలయానికి నేరుగా వెళ్లి భౌతిక ఫైళ్లను అందించుట తదితర భరాలు రెవెన్యూ ఉద్యోగులపైనే ఉన్నాయి. పని భారం ఎదుర్కొంటున్న రెవెన్యూ ఉద్యోగులకు ప్రాణ సంకటంగా ఉందని జేఏసీ నాయకులు తమ ఆవేదనను మీడియా ముందు వివరించారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *