మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త కత్తితో దాడి చేసిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది, ఫిబ్రవరి మంగళవారం సుమారు 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.లింగంపర్తి గ్రామానికి చెందిన బొడ్డపాటి కుమారి,40 సంవత్సరాలు, భర్త లక్ష్మీపతి అనుమానంతో ఆమెపై దాడి చేసినట్లు సమాచారం. నిందితుడు బొడ్డపాటి లక్ష్మీపతి,44 సంవత్సరాలు.ఎస్సీ. స్వగ్రామం జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామం, ప్రస్తుతం లింగంపర్తి గ్రామంలో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
స్థానికుల వివరాల ప్రకారం, భార్యపై అనుమానం పెంచుకున్న లక్ష్మీపతి, కత్తితో ఆమె తలపై మరియు కుడి చేతిపై తీవ్రంగా నరికాడు. ఈ దాడిలో కుమారి తీవ్రంగా గాయపడి రక్తస్రావం అవుతూ కుప్పకూలింది. ఘటనను గమనించిన గ్రామస్థులు వెంటనే ఆమెను సమీపంలోని ఏలేశ్వరం ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు చికిత్స అందించి, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య కోసం ఆమెను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ సంఘటనతో గ్రామంలో ఒక సరిగా ఉధృతిత పరిస్థితులు నెలకొన్నాయి. మహిళపై జరిగిన దాడిని గ్రామస్థులు తీవ్రంగా ఖండిస్తున్నారు. కుటుంబ సమస్యల కారణంగా ఈ దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకునే పేర్కొంటున్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *