మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ;భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆదేశాల వరకు,16వ తారీకున సోమవారం భారత చైతన్య యువజన పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గం ఇంచార్జి గొంప శివకుమార్ యాదవ్,ప్రత్తిపాడు నియోజవర్గంలో,ప్రత్తిపాడు మండలం పెద్ద శంకర్లపూడి,రౌతుపాలెం,వేములపాలెం,పెద్దిపాలెం మొదలైన గ్రామాల లో ఈనెల 22వ తారీకున జరగబోతున్న బీసీ సింహ గర్జన సభను ఉద్దేశించి, ప్రతి ఒక్కరికి వివరిస్తూ,బీసీ,ఎస్టీ,ఎస్సీ, మైనార్టీలకు, ప్రతి ఒక్కరికీ,ప్రతి గ్రామంలో ఉన్న బిసి సంఘ నాయకులకు, రైతులకు,యువకులకు ప్రతి ఒక్కరికి సభ యొక్క ప్రయోజనాలను వివరించడం జరిగింది.అలాగే ఊరూరా పోస్టర్లు కూడా అంటించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ బీసీ సింహ గర్జన సభను విజయవంతం చేయడం ద్వారా, బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ వర్గాల బలం, ఐక్యత ను చాటి చెప్పాలని, అందువలన ఈ బీ సి సింహ గర్జన సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శివ కుమార్ తో పాటు, బీసీ,ఎస్ సి, ఎస్ టి, మరియు మైనార్టీ సోదరులు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *