ముఖ్య అతిథులుగా హాజరైన ఎన్నారై టీడీపీ యువనాయకుడు ఎన్. పి విక్రమ్

బంగారుపాల్యం ,మనధ్యాస, ఫిబ్రవరి 17. రిపోర్టర్ కమల్ రెడ్డి. పూతలపట్టు నియోజకవర్గం ,బంగారుపాళ్యం మండలం ,మడుపోలూరు సమీపంలోని వసంతాపురంలో వెలసిన శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారి అమావాస్య పూజ మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎన్నారై ఎన్.పి.విక్రమ్ పాల్గొని హోమ యజ్ఞాదులు చేసి అమ్మవారికి పూజలు చేశారు.అనంతరం అమ్మవారిని మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి కుంభం పెట్టి పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో, ఆలయ ధర్మకర్త పూజారి శివాజీ, బెజవాడ నవీన్,దుర్గ చౌదరి,సతీష్, శివరాజ్,బాల, గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *