మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పవిత్ర స్నానమాచరించి దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన శ్రీ రాజరాజేశ్వరీ సమేత రామలింగేశ్వర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులకు బదిరెడ్డి వెంకటరమణమ్మ17వ వార్డు కౌన్సిలర్ ప్రోత్సాహంతో వైసీపీ రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి,యువ నాయకుడు మూడో వార్డు కౌన్సిలర్ బదిరెడ్డి గోవింద్,బదిరెడ్డి వెంకన్నబాబు ( శ్రీను) ఆధ్వర్యంలో సుమారు 3 వేల మందికి పైగా భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రత్తిపాడు వైసిపి ఇంచార్జి ముద్రగడ గిరిబాబు హాజరయ్యారు బదిరెడ్డి గోవింద్ నివాసానికి వచ్చిన ముద్రగడ గిరిబాబుకి వైసీపీ శ్రేణులతో కలిసి స్వాగతం పలికి ఘన సన్మానం చేశారు. అనంతరం బారీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు.ఈ సందర్భంగా ముద్రగడ గిరిబాబు మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియచేసారు.గత 15 సంవత్సరాలుగా మహాశివరాత్రి సందర్భంగా దర్శనానికి విచ్చేసిన వేలాది మంది భక్తులకు బదిరెడ్డి గోవింద్ అన్నదానం చేయడం అభినందనీయమన్నారు.పలు సేవా కార్యక్రమాల్లో చేయడంలో ముందుండే గోవింద్ పరువురికి ఆదర్శప్రాయుడన్నారు. గోవిందతో ఉన్న మా బంధం ఎప్పటికి ఇలాగే ఉండాలని కోరుకున్నట్లు గిరిబాబు తెలిపారు.ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి పలువురు వైసీపీ నాయకులు విచ్చేసి ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు శిడగం వెంకటేశ్వరరావు,దలే కిషోర్,జువ్విన వీర్రాజు,సుంకర రాంబాబు,సామంతుల సూర్యకుమార్,వాగు బలరాం,చౌదరి రాంబాబు,గొల్లపల్లి కాశీ విశ్వనాధ్,గొల్లపల్లి సురేష్,గౌతు నాగు,గుడాల వెంకటరత్నం,వీరంరెడ్డి రామకృష్ణ,సఖిరెడ్డి బుజ్జి,లోగీసు శేఖర్,సిరిపిరపు రాజేష్,భీశెట్టి రాజా,దత్తి రాజా,బుద్ద గణేష్,గొంతిరెడ్డి సతీష్,బంటుపల్లి శ్రవణ్,ఈపి రాము, రాచర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *