

మన న్యూస్: పినపాక నియోజకవర్గం నిధులు వస్తున్న.. రహదారి కష్టాలు ప్రజా ధనం ఎవరు సొంతం పట్టించుకోని పాలకులు అధికారులు ఇకనైనా మొద్దు నిద్ర వీడతారా?సామాజిక కార్యకర్త లాయర్ కర్నే రవి మణుగూరు సింగరేణి ఉపరితల గల నుండి భద్రాద్రి పవర్ ప్లాంటుకు బొగ్గును సరఫరా చేసే లారీల ద్వారా మణుగూరు, ఏటురు నాగారం ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారిందని, సామాజిక కార్యకర్త , లాయర్ కర్నే రవి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాకు ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు.రోజుకు 16000 టన్నుల బొగ్గును సరఫరా చేసేందుకు వందలాది భారీ వాహనాలు రాకపోకలకు తోడు ఇసుక ర్యాంపుల నుండి 24 గంటలు ఇసుకను రాష్ట్రవ్యాప్తంగా ఈ రహదారి ద్వారానే వాహనాలు రాకపోకల రద్దీలో ఇసుక లారీలు, బొగ్గు లోడు లారీల కారణంగా నిత్యం ప్రమా
దాలు జరుగుతున్నా యన్నారు . విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నరహదారుల శాఖ నిర్లక్ష్యం కాదా అని ఆయన ప్రశ్నించారు. నిధులు వస్తున్న ప్రజలను రహదారి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయన్నారు. పూర్తిగా గుంతల మయమైన రహదారి ప్రయాణం ప్రజలకు ప్రాణ సంకటం గా మారిందన్నారు. ఈ రహదారిపై నిత్యం ప్రయాణించే అధికారుల కు, ప్రజా ప్రతినిధులకు ప్రజల కష్టాలు కనిపించడం లేదా అని ద్వజం మేత్తరు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి రహదారి మరమతుల కోసం విడుదలయ్యే నిధులు ఎటువైపు పోతున్నాయని ప్రశ్నించారు. ప్రజాదానం ఎవరి జేబులో నిండుతున్నాయ న్నారు. రహదారి పూర్తిగా ధ్వంసం అయిన ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాల గొంతులు ఎందుకు మూగబోయాయో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రహదారి కష్టాలపై పలుమార్లు జిల్లా ఆర్ అండ్ బి అధికారులకు, జిల్లా కలెక్టర్ కు పలుమార్లు వినతి పత్రాలు సమర్పించడంతో స్పందించిన ఆర్ అండ్ బి అధికారులు టెండర్ ప్రక్రియ నిర్వహించి నాలుగు నెలల గడుస్తున్నా మరమ్మతు లు చేయకుండా చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజల ప్రాణాలంటే వారికి లెక్కలేకుండాపోయిందని విమర్శించారు. అధికారులకు జీతాల మీద శ్రద్ధ ప్రజల ప్రాణాల మీద లేదా అని, ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన పాలకులకు రహదారుల కష్టాలు పట్టవా అన్నారు.వాహనదారుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని సత్వరమే మణుగూరు ఏటురునా గారం ప్రధాన రహదారిని బాగు చేయాలని, లేని పక్షంలో ప్రజలను సమీకరించి రహదారి దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు.