మన ధ్యాస,నెల్లూరు, ఫిబ్రవరి 1 :నెల్లూరు నగరంలోని సీపీఆర్ కళ్యాణ మండపంలో ఆదివారం ఉదయం 11 గంటలకు మేకపాటి శాంతి కుమారి ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు మధ్య అత్యంత ఘనంగా భారీ జన సందోహంతో నిర్వహించారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి జిల్లా ఇన్ చార్జి మంత్రి ఎన్ఎండీ ఫరూక్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, రాష్ట్ర ఒక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ముఖ్య అతిథిలు గా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, సోమిరెడ్డి, ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తదితరులతో కలిసి ముందుగా జ్యోతి ప్రజ్వలన వెలిగించి ప్రమాణస్వీకార మహోత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా గ్రంధాలయ సంస్థ మేకపాటి శాంతి కుమారి మాట్లాడుతూ………. అక్షరమే ఆయుధం..గ్రంధాలయాలే దేవాలయాలు అని, నిశ్శబ్ద గ్రంథాలయ సంస్థకి నన్ను చైర్మన్ గా చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అని అన్నారు. అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 61 గ్రంథాలయ శాఖలను రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు వారి సహాయ, సహకారాలతో పూర్తిగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. గ్రంథాలయాలు విద్యార్థుల యొక్క జీవన విధానాన్ని, నైపుణ్యతను పెంపొందిస్తానని తద్వారా భవిష్యత్తులో పోటీ పరీక్షలకు, ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. జిల్లాలోని శిథిలావస్థలో ఉన్న గ్రంథాలయాలను అభివృద్ధి చేసి పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ కోటేశ్వరరావు,టిడిపి నెల్లూరు జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కొమ్మి లక్ష్మనాయుడు, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజెర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, ఏపీ ఇన్ లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ డాక్టర్ జెడ్.శివప్రసాద్, విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం పాలకమండలి సభ్యురాలు పనబాక భూలక్ష్మి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.





