
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:నగరంలోని ప్రతిభా స్కాలర్షిప్ ట్రస్ట్ ప్రతి సంవత్సరం ప్రతిభ గల పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తూ వారి చదువును ప్రోత్సహిస్తుంది.అమెరికాలో స్థిరపడిన చెక్కపల్లి రమేష్ ఆర్థిక సహాయంతో ఈ ట్రస్ట్ నిర్వహించబడుతుంది.ట్రస్ట్ చైర్మన్ వరుపుల తమ్మయ్య బాబు(చిట్టిబాబు) మాట్లాడుతూ ప్రతిభ గల పేద విద్యార్థులు చదువుకి ఆటంకం కలగకుండా సహాయం చేయడం కోసం ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.స్థానిక ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ ఎస్.విజయబాబు,తాళ్లూరి గొల్లాజి హాజరయి మాట్లాడుతూ ఉపకార వేతనం అందుకున్న విద్యార్థులు భవిష్యత్తులో అభివృద్ధి చెందాక అవకాశం మేరకు మిగిలిన వారికి సహాయం చేయవలెనని పిలుపునిచ్చారు.ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ ఇబ్రహీం ఖాన్ మాట్లాడుతూ ఏడు మంది ఎంబిబిఎస్ విద్యార్థులకు 30 వేల చొప్పున 2,10,000 రూపాయలు,ఆరుగురు బీటెక్ విద్యార్థులకు 15 వేల చొప్పున 90,000 రూపాయలు,బిఎస్సి, బీకాం విద్యార్థులకు 4000 రూపాయలు ఉపకార వేతనం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మెంబర్స్ జోగిరాజు, మూర్తి,విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.