
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆదేశాల మేరకు సిరిపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దనేకులు వీరభద్రం, ఓనుం మంగ శ్రీనివాస్,సంఘన ప్రబోజి, టీడీపీ sc సెల్ నాయకుడు బచ్చల శివ,కాకర జోర్జ్ దనేకుల అదృష్టదీపుడు ఏర్పాటు చేసినటువంటి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సభకు ముఖ్య అతిథిగా ఎంపీపీ సభ్యులు గొల్లపల్లి బుజ్జి పాల్గొన్నారు.స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గొల్లపల్లి బుజ్జి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ దివంగత నేత ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు
చిరస్మరణీయంగా గుర్తుపెట్టుకుంటారని అలాగే స్వర్గీయ ఎన్టీఆర్ చేసిన సేవా కార్యక్రమాల గురించి ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల పెదబాబు,బస ప్రసాద్, చిక్కాల లక్ష్మణరావు, కొప్పుల బాబ్జి, కొప్పిశెట్టి సూరిబాబు, నూకతాటి ఈశ్వరుడు తూర్పు లక్ష్మీపురం బోసు,వెలుగురి హరే రామ్, బేరి ప్రభాకర్ ,జనసేన పార్టీ నాయకులు సాగి వెంకటరమణ, జనసేన పార్టీ సీనియర్ నాయకులు దొడ్డి శ్రీనివాస్, దొడ్డి దుర్గాప్రకాస్, సాగి బంగారు రాజు, సాల వీరబాబు, మరియు కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు