
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ప్రజలందరూ మెచ్చిన ఒకే ఒక్క నాయకుడు దివంగత నేత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు అని టిడిపి సీనియర్ నాయకుడు పైల సత్యనారాయణ అన్నారు. వృద్ధాప్యంలోనూ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న సత్యనారాయణకు ఎన్టీఆర్ అంటే ఎనలేని అభిమానం. ఈ పరిస్థితుల్లో ఆయన తన స్వగృహంలోనే కుర్చీకి పరిమితమైన స్థితిలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి ఆదివారం పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ పెట్టిన అనతి కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన ప్రాంతీయ పార్టీ నాయకుడు ఎన్టీఆర్ మాత్రమే అన్నారు. రాష్ట్రంలో మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టి, అనేక ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. కిలో రెండు రూపాయల బియ్యం, పేదవారికి పక్కా గృహాలు నిర్మించి ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ ది అని అన్నారు. సామాన్యుడి కి కూడా రాజ్యాధికారంలో భాగం ఇచ్చింది ఎన్టీఆర్. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలుపరిచింది ఎన్టీఆర్ ప్రభుత్వం మాత్రమే అన్నారు. ఎన్టీఆర్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్నను ప్రకటించి, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడాలని పైల డిమాండ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి యశస్సును చాటిన తెలుగు తేజం, మహనీయుడు ఎన్టీఆర్ మాత్రమే అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు టిడిపిని వీడలేదు. ఎన్నో అటుపోటులను ఎదుర్కొనే టిడిపి కష్టకాలంలో కూడా సత్యనారాయణ ఎన్టీఆర్ వెంటే ఉన్నారు.
ఈ కార్యక్రమంలో సామంతుల భక్తాంజనేయులు, దత్తి దొర, కోరాడ రాము, సామంతుల ఫణికుమార్, కూన అప్పారావు, బళ్లారి శ్రీను, శిడగం రవి, సతివాడ రాఘవ, కర్రోతు జానకిరామ్, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.