మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30 వ వర్ధంతి వేడుకలు ఏలేశ్వరం ఘనంగా నిర్వహించారు. పట్టణ నాయకులు బొదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి మండల టిడిపి అధ్యక్షులు జ్యోతుల పెదబాబు హాజరయ్యారు. టిడిపి కార్యాలయం వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలు చేసి నివాళులర్పించారు, అనంతరం. స్థానిక గ్రంథాలయం వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేపట్టి నివాళులర్పించారు.అనంతరం ఏలేశ్వరం ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి నందు రోగులకు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నాయకులు చేతుల మీదుగా పళ్ళు రొట్టెలు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ. తెలుగుజాతి గొప్పదనాన్ని దేశ నలుమూలలా ప్రకాశింపజేసిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారకరామారావుని కొనియాడారు.
నాటి ఆ మహానేత స్ఫూర్తితో నేటికీ కూడా తెలుగుదేశం పార్టీ అదే క్రమశిక్షణతో ముందుకు సాగుతుందనన్నారు.
ఆ మహనీయుని అడుగుజాడల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పనిచేస్తున్నారని అన్నారు. ప్రజా సంక్షేమం, ప్రాంతాల అభివృద్ధి స్వర్గీయ నందమూరి కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్రానికి పరిచయం చేశారని ఈ సందర్భంగా కొనియాడారు,ఈ కార్యక్రమంలో. కోణాల వెంకటరమణ ఎండగుడు నాగబాబు, పెండ్ర శ్రీను, మామిడి లలిత, రుచి రమేష్, వాగు రాజేష్, కరోతు సత్యనారాయణ (గాంధీ)జొన్నాడ వీరబాబు, సామంతులు గోపి, బస్సా ప్రసాద్, చిక్కాల లక్ష్మణరావు, కొప్పుల బాబ్జి, కోరుకొండ నూకరాజు, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు…

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *