మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:హిందూ సంప్రదాయాలకు ఆవు లకు పెద్ద పీట వేస్తాం.హిందూ ధర్మం ప్రకారం ఆవును దేవతగా పూజిస్తాం. ప్రస్తుతం ఆవులు ఎంతో దయనీయమైన స్థితిలో బతుకుతున్నాయి.ముఖ్యంగా పట్టణాల్లో చాలా ఆవులు తిండి లేక వ్యర్థాలను, చెత్తచెదారాన్ని తింటున్నాయి.రోడ్డుపై దొరికిన దాన్నే ఆహారంగా తీసుకుంటున్నాయి.అందులో ఎక్కువ భాగం ప్లాస్టికే ఉంటోంది.ఏలేశ్వరం లో రాత్రిపూత వాణిజ్య వ్యాపారస్తులు, చిల్లరీ దుకాణ దారులు వారి షాపులో నుంచి చెత్తాచెదారాన్ని సేకరించి రోడ్డుపై పడేయడంతో మూగజీవాల ప్రాణాలు తీస్తున్నారు. మానవ తప్పిదాల వల్ల నోరులేని జీవులు మృత్యువాత పడుతున్నాయి. పచ్చని పచ్చిక బయళ్లు తినాల్సిన ఆవులు చేత్తకుప్పల మధ్య ప్లాస్టిక్ సంచులు తింటున్నాయి. నగరప్రజలు బాధ్యతారహితంగా రోడ్లపై ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఇష్టారాజ్యంగా పడేయడంతో వాటిని తిని గోమాతలు తనువు చాలిస్తున్నాయి. వీటితో మనుషులతో పాటు పశుపక్షాదులకు కూడా ప్రమాదం ఏర్పడుతోంది. ముఖ్యంగా రోడ్లపై తిరిగే మూగ జీవాలు పై తీవ్ర ప్రభావం ఉంటుంది. రోడ్లపై తినే ఆహారంతో పాటు ప్లాస్టిక్ కవర్లు ఇతరత్రా ప్లాస్టిక్ వ్యర్థాలు నేరుగా కడుపులోకి పోవడంతో అవి పెద్ద మొత్తంలో పేరుకొని రక రకాల వ్యాధులతో బారిన పడి మృత్యువాత పడుతున్నాయి.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *