మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం నగర పంచాయతీ రెండో వార్డ్ లో వీధి దీపాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.వార్డులో గత మూడు రోజులుగా వెలగని వీధిదీపాలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రాత్రి సమయంలో ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే కష్టంగా ఉందని ఆయా వార్డు ప్రజలు వాపోతున్నారు. ఉన్న వీధి దీపాలు అక్కడక్కడ వెలుగుతున్నాయే తప్ప, కొత్తవి ఏర్పాటు చేయాలేదని ప్రజలు విమర్శిస్తున్నారు.రాత్రి సమయంలో ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే తీవ్ర భయాందోళ చెందుతున్నట్లు చెప్పారు. వార్డులో విషపురుగుల కుక్కలు సంచారం ఉండడంతో ఇళ్లలోనుంచి బయటకు రాలేకపోతున్నట్లు చెబుతున్నారు. ఎవరికి ఎప్పుడు ఏప్రమాదం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నట్లు. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచడం లేదని ప్రజలు వాపోతున్నారు.ఇప్పటికైనా అధికారులు,స్పందించి వార్డులో వీధిదీపాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *