మన ధ్యాస,నెల్లూరు, జనవరి 11:పేద ప్రజలకు సంక్రాంతి కానుకగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న నెల్లూరు నగర 6వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా ఆర్యవైశ్య అర్బన్ సంఘం అధ్యక్షులు లయన్ కొండా ప్రవీణ్ శంకర్ కు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ అభినందనలు తెలిపారు. నెల్లూరు నగరంలోని ఆరవ డివిజన్లోని పప్పులు వీధిలో ఆదివారం కొండా ప్రవీణ్ శంకర్ మిత్రమండలి ఆధ్వర్యంలో పేదలకు సంక్రాంతి కానుక సేవా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పాల్గొని ఫలసరుకులను పంపిణీ చేశారు. ముందుగా మంత్రి నారాయణ కు సాంప్రదాయ నృత్య ప్రదర్శనతో చిన్నారులు, ఆర్యవైశ్య నాయకులు స్వాగతం పలికారు. అనంతరం పిల్లలకు మంత్రి నారాయణ గాలిపటలు అందజేసి మీడియాతో మాట్లాడారు. సేవా కార్యక్రమాలు చేస్తున్న కొండా ప్రవీణ్ మిత్రమండలికి అభినందనలు తెలిపారు.సంక్రాంతి కానుక కింద 1020 మంది పేదలకు ఫల సరుకులు పంపిణీ చేసారు.మూడేళ్ళుగా ఈ కార్యక్రమం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, కొండ ప్రవీణ్ శంకర్ మిత్ర మండలి సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *