మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ),
మహమ్మద్‌నగర్ మండలంలోని గున్కుల్ గ్రామ సర్పంచ్ గంగి రమేష్‌, ఉప సర్పంచ్ సాయిగౌడ్‌లకు గ్రామ సంఘాల ఆధ్వర్యంలో శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సంఘాల ప్రతినిధులు సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని సర్పంచ్ గంగి రమేష్‌ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐకెపి సీసీ శ్రీకాంత్‌, గ్రామ సంఘం అధ్యక్షురాలు దస్తగోని వినోద, ఉపాధ్యక్షురాలు దండు నవణిత, వీఓఏ మన్సూర్‌, గ్రామ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *