122 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా దీన్ దయాల్ గెలుపు…విప్పమానుపట్టెడ సర్పంచ్‌గా దీన్ దయాల్ ఘనవిజయం…

విజయాన్ని గ్రామ ప్రజలకు అంకితం చేసిన దీన్ దయాల్..

రేణిగుంట మన ద్యాస నవంబర్ 26.

తిరుపతి జిల్లా
రేణిగుంట, ప్రతినిధి:
రేణిగుంట మండలం విప్పమానుపట్టెడ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఐటీ కోఆర్డినేటర్ దీన్ దయాల్ ఘనవిజయం సాధించారు. గ్రామపంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తన సమీప ప్రత్యర్థిపై 122 ఓట్ల మెజార్టీతో విజయం కైవసం చేసుకున్నారు.
సర్పంచ్ ఎన్నికల్లో దీన్ దయాల్ విజయం సాధించడంతో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచి ఓటు వేసిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ విజయాన్ని గ్రామస్తులకు, ప్రజలకు అంకితం చేస్తున్నట్లు దీన్ దయాల్ పేర్కొన్నారు.
గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండి సేవలందిస్తాననే సంకల్పంతో ముందుకు సాగనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
దీన్ దయాల్ విజయంతో విప్పమానుపట్టెడ గ్రామంలో జనసేన శ్రేణుల్లో ( కూటమి)నూతన ఉత్సాహం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *