మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )తెలంగాణ క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అసోసియేషన్ (TCRPA) ఆధ్వర్యంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ ఉద్యోగులు మంగళవారం తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమ,దివ్యాంగులు, వయోవృద్ధుల సాధికారిక శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఉద్యోగులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.గత 15 సంవత్సరాలుగా నిరంతరంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ తగిన వేతనాలు లేకపోవడం,ఉద్యోగ భద్రత లేక జీవితాలను చాలీచాలని వేతనాలతో గడుపుతున్నామని వారు వాపోయారు.ప్రతిపక్ష హోదాలో ఉన్న సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లస్టర్ రిసోర్స్ పర్సన్లకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ,మానవతా దృక్పథంతో వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.దీనిపై స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,క్లస్టర్ రిసోర్స్ పర్సన్ ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.ఈ సమావేశంలో TCRPA అధ్యక్షులు తిరందాస్,సంతోష్ కుమార్,కార్యదర్శి కొత్త కాపు శ్రీనివాస్ రెడ్డి,రాష్ట్ర ముఖ్య సలహాదారులు బి. శ్రీధర్ కుమార్,కె. భాస్కర్,డి. శరత్ కుమార్,యువరాజు తదితరులు పాల్గొన్నారు.