మన ధ్యాస, నెల్లూరు, డిసెంబర్ 29: నెల్లూరు జిల్లాలోని పెట్రోల్ బంకుల మీద ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని పెట్రోల్ బంక్ అసోసియేషన్ సభ్యులు ,బాధ్యులు ప్రెస్ క్లబ్ ద్వారా ప్రజలకు తెలిపారు.ఇథనాల్ E 10,E 20 అనే రెండు రకాలుగా పెట్రోల్ కలిసి వస్తుందని వాటి వలన పాత వాహనాలు చెడిపోతాయని నూతన వాహనాలు వాడితో ఇబ్బందులు ఉండవని కానీ ఇథనాల్ కలిసినటువంటి పెట్రోల్ మాత్రమే మనకు అందుబాటులో ఉందని ఈ విషయం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని విత్తనాలు పెట్రోలు మరియు మామూలు పెట్రోల్ ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా చూడాలని తెలిపారు. కొంతమంది పెట్రోల్ లో నీరు కలిపామని ఆరోపణలు చేస్తున్నారు అది వాస్తవం కాదని పేర్కొన్నారు.అలాగే డెన్సిటీ అనేది సమంగా ఉండకపోవడానికి కారణం వివిధ రకాల కంపెనీలు వివిధ రకాలుగా పంపిణీ చేస్తున్నందున ఈ పరిస్థితి ఏర్పడింది దీనికి కూడా కారణం ప్రభుత్వమే అని తెలిపారు. లోకంలో కూడా తేడాలు వస్తున్నాయి దానికి గల కారణం మొత్తం నాలుగు ఐదు రకాలుగా మిషన్లు ఉన్నాయి ఒక్కొక్క మిషన్లో కొంత తేడా అనేది వస్తుంది అని తెలిపారు. ఏది ఏమైనా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ తరపున ప్రజలకు సేవ చేయడానికి నిరంతరం కృషి చేస్తామని ఆ సంస్థ బాధ్యులు ప్రజలకు హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *