మన ధ్యాస, నెల్లూరు,డిసెంబర్ 25 : ది విశ్వవ్యాప్తమైన పండుగ అని ఇది శాంతికి, సద్భావనకు ప్రతీక అని ఈ పర్వదినం ప్రజలందరి మనసుల్లో ప్రేమను, కరుణను పెంపొందించి..సమాజంలో ఐకమత్యంతో ముందుకు వెళ్లాలని.. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగురు నారాయణ సతీమణి రమాదేవి తెలిపారు.డివిజన్ కు విచ్చేసిన మంత్రి నారాయణ సతీమణి రమాదేవికి ఘనంగా స్వాగతం పలికారు.అంతకముందు 13వ డివిజన్ యాలమవారి దిన్నెలోని పలు చర్చిలో కేక్ కట్ చేసి సంబరాలు చేస్తున్నారు, అనంతరం సంతపేటలోని సెయింట్ జోసెఫ్ క్యాథడ్రాల్ బిషప్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన సంప్రం (తెరు మహోత్సవంలో)ఆమె పాల్గొన్నారు.అనంతరం ఎస్టి మేరీస్ సిస్టర్స్ హోమ్ ని సందర్శించారు.అనంతరం ఆర్చిరోడ్డులోని ఓపెన్ బైబిల్ రీడింగ్ రూమును ప్రారంభించారు.అనంతరండివిజన్ లోని మహిళా కార్యకర్తలు కుటుంబ సభ్యుల నివాసానికి వెళ్లి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ క్రిస్మస్ ప్రజలందరూ ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.మనం కుటుంబ సభ్యులతో, స్నేహితులతో గడిపే సమయం చాలా విలువైనది. ఈ అనుబంధాలను మనం మరింత బలపరుచుకోవాలి. అలాగే, గత సంవత్సరంలో జరిగిన మంచిని గుర్తుకు తెచ్చుకుంటూ, భవిష్యత్తుపై ఆశాభావంతో ముందుకు వెళ్లి. శాంతి, సంతోషాలతో నిండిన క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలోకి కొత్త వెలుగును తీసుకురావాలని రమాదేవి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర మహిళా అధ్యక్షురాలు కపిర రేవతి, ఇంచార్జ్ 51వ డివిజన్ క్లస్టర్ ఇంచార్జ్ ప్రశాంత్, జనరల్ సెక్రెటరీ కుమార్ మంగళ ం, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజేష్, మహిళా మరియు టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.



