, మన ధ్యాస, నెల్లూరు, డిసెంబర్ 26 :నెల్లూరు నగరంలోని రాంజీనగర్, ఏడవ వీధి లో వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో వారి ఇంటి వద్ధ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ…….వంగవీటి మోహన రంగా పేదల పక్షాన నిలబడి అన్యాయాలకు ఎదురు నిలిచిన ప్రజానాయకుడు అని అన్నారు.శరీరాన్ని కూల్చగలిగారు గానీ,రంగా ఆలోచనలను చంపలేకపోయారు అని అన్నారు.ప్రజల కోసం చేసిన త్యాగంఎప్పటికీ మరువలేనిదని అన్నారు.నేల మీద రంగా గారు నడిచిన ప్రతి అడుగు,రక్తంతో రాసిన చరిత్ర గా విరాజిల్లుతుంది అని అన్నారు.జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాయకత్వంలోప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్నామని,వంగవీటి రంగా ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడతామని తెలిపారు. అన్యాయానికి ఎదురు తిరగటం,నిజం కోసం నిలబడడం,ప్రజల పక్షాన ధైర్యంగా మాట్లాడడంఇదే రంగా కి నిజమైన శ్రద్ధాంజలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనివంగవీటి మోహన రంగా గారికి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్,రూరల్ నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, భూపతి రాఘవన్న,సుధామాదవ్,లీగల్ సెల్ నాయకులు సింగంశెట్టి శ్రీరామ్, భూపతి విజయ్,హేమచంద్ర యాదవ్,శరవణ,కృష్ణమోహన్ రెడ్డి,నరహరి,శివ,సుధాకర్,గుత్తి శ్రీకాంత్,పెనేటి శ్రీకాంత్,కేదారి మనోజ్,శ్రీమంతు,హరి,పత్తి మల్లి,ప్రశాంత్ గౌడ్,వర్షన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *