మన ధ్యాస,కోట, డిసెంబర్ 26 : తిరుపతి జిల్లా,కోట పట్టణంలో కోట క్రాస్ రోడ్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు గుంతల మయంగా ఉన్న రోడ్డుకు మరమత్తులు చేసేందుకు ప్రభుత్వం విధులు మంజూరు చేసింది. నిధులు మంజూరు ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు చేపట్టింది. కోట ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న రోడ్డు నుండి కోట క్రాస్ రోడ్డు వరకు నిర్మాణ పనుల్లో భాగంగా గోపాల్ రెడ్డి బొమ్మ సమీపము వరకు సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టారు.అయితే ఈ మార్గంలో గోపాల్ రెడ్డి బొమ్మ సమీపంలో పంట కాలువ ఉంది. ఆ కాలువపై ఉన్న పాత బ్రిడ్జి మరమ్మత్తుల గురై ప్రమాదానికి చెరువులో ఉంది.ఆ బుజ్జి కి రెండు వైపులా ఉన్న పిట్టగోడలు కూలిపోయి బ్రిడ్జి పై భాగం రోడ్డు మరమ్మతుల గురై గుంతల మయంగా గోతులు మయంగా తయారై వాహనదారులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దానిని సంబంధిత అధికారులు గమనించక, మరమ్మతులు చేపటగా కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టక వదిలేశారు.దీంతో ఆ బ్రిడ్జి ప్రమాదాలకు. నియంగా మారింది. అదేవిధంగా గోపాల్ రెడ్డి బొమ్మవరకు సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టగా మధ్యలో బ్రిడ్జి వద్ద అసంపూర్తిగాను, నాసిరకంగా నిర్మాణాలను చేపట్టారు. అదేవిధంగా గోపాల్ రెడ్డి బొమ్మ వద్ద నుంచి తారు రోడ్డు కొంతమేర మరికొంత రోడ్డు క్రాస్ రోడ్డు వరకు గుంతల మయంగా తయారైంది.ఈ విషయం నిత్యం వాహన చోదకులు ప్రమాదాలకు లోనవుతున్న సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించకపోవడం విశేషం.ఈ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లకు చేసిన పనులకే నిధులు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీనిపై పాలకులు స్పందించి కోట క్రాస్ రోడ్ నుండి ప్రమాదకరంగా తయారైన వంతెనను, అసంపూర్తి రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని వాహనదారులు ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *