మన ధ్యాస,నెల్లూరు రూరల్, డిసెంబర్ 26: నెల్లూరు రరూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.ప్రతి రోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ప్రజలకు ఉదయం 7గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నాము అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.రాష్ట్రముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు,యువనేత రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే నాలుగు వారాలు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ప్రజలు తెలియజేసిన సమస్యలను పరిష్కారం దిశగా చేపట్టవలసిన చర్యలు అధికారులతో కలసి ఎప్పటికపుడు సమన్వయం చేస్తున్నాం, పరిష్కారం అయ్యే ప్రతీ సమస్యను పరిష్కరిస్తాం అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.పై కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నందిమండలం భాను శ్రీ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, క్లస్టర్ ఇంఛార్జులు జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్, కనపర్తి గంగాధర్, ఏఎంసీ డైరెక్టర్ కాకుపల్లి శివకుమార్, నెల్లూరు రూరల్ నియోజకవర్గ టిడిపి మైనారిటీ అధ్యక్షుడు అస్లాం, 28వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు చెక్కా సాయి సునీల్, 33వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు కరణం హజరత్ నాయుడు, 2వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు మేకల అనిల్ యాదవ్, టిడిపి నాయకులు దిలీప్ రెడ్డి, వడ్లమూడి రమేష్ చౌదరి, మాస శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *