మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం;పట్టణంలోని క్వారీపేట ప్రాంతంలో అఖిల భారత దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఫౌండర్,జాతీయ అధ్యక్షుడు,కస్తాల సుధాకర్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది దివ్యాంగులకు ఆదివారం రగ్గుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు,కౌన్సిలర్ బొదిరెడ్డి గోపి పాల్గొన్నారు.ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ దివ్యాంగుల రక్షణ నిమిత్తం అన్ని వసతులతో కూడిన కమ్యూనిటీ హాల్, నిర్మాణానికి కృషి చేస్తామని దివ్యాంగుల,విద్య,వైద్య సౌకర్యాలు మెరుగుపరడానికి కూటమి ప్రభుత్వం పెన్షన్ 3వేల రూపాయలు నుండి 6వేల రూపాయలకు పెంచిందన్నారు.అలాగే కస్తాల సుధాకర్ మాట్లాడుతూ దివ్యాంగులు క్రీడలతో పాటు అన్ని రంగాల్లోనూ విజయం సాధించేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కృషికి అభినందనీయమన్నారు.ఇటీవల అంధుల మహిళ వరల్డ్ కప్ భారత్ కైవసం చేసుకోవడం వెనక ఎంతో కృషి దాగి ఉందన్నారు. వారిని అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నజరానా అందజేయడం హర్షనీయమన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మూది నారాయణస్వామి, రాయుడు చిన్న,ఎండగుండి నాగబాబు,నాయకులు సామంతులు గోపి,రుచి రమేష్,దివ్యాంగుల మహిళా అధ్యక్షురాలు అంబటి రాజకుమారి,వర్కింగ్ ప్రెసిడెంట్ బొత్స యేసు,గుడ్ల తారక వంశీకృష్ణ,బి శ్రీనివాస్,చిట్టి మణి,దివ్యాంగులు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *