మన ధ్యాస ప్రతినిధి ఏలేశ్వరంఏలేశ్వరం నగర పంచాయతీ లో 1,20 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బత్తిన శ్రీను, పేకల జాన్ , ఎద్దు నవీన్, ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం లో కేకును కట్ చేసి దుప్పట్లో పంచిపెట్టారు. ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ సంక్షేమానికి సారధి,అభివృద్ధి కి వారధిగా జగన్మోహన్ రెడ్డిని చెప్పుకోవాలన్నారు‌.ఆయన పరిపాలన కాలంలో దేశంలో ఎక్కడ లేనన్ని సంక్షేమ ఫలాలు పేదప్రజలకు ముఖ్యంగా మహిళలకు అందజేశారని కొనియాడారు.ఐదేళ్ళ పరిపాలనలో అన్నివర్గాల ప్రజలను సంతృప్తి పరిచారని పేర్కొన్నారు.రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతీఒక్కరకి సంక్షేమ పథకాలను అందించి ప్రజల మన్ననలు పొందారన్నారు.వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు మహిళలంతా సిద్ధంగా ఉన్నారన్నారు.ఈ కార్యక్రమం లో శిడగం వెంకటేశ్వరరావు, బొదిరెడ్డి గోవిందు, అలమండ నాగేంద్ర, సుంకర రాంబాబు,సామంతుల సూర్యకుమార్, వాగు బలరాము, జువ్వున వీర్రాజు,బత్తిన రవి,కల్ధరి సూరిబాబు, రాజేష్, ప్రేమ్ కుమార్,వైఎస్ఆర్సిపి కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *