తవణంపల్లి డిసెంబర్ 21 మన ధ్యాస
పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండల జడ్పిటిసి భారతీ మధు కుమార్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ మాట్లాడుతూ రెండు పోలియో చుక్కలతో బిడ్డ భవిష్యత్తు బాగుంటుందన్న విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాలని తవణంపల్లి జడ్పిటిసి భారతి మధు కుమార్ అన్నారు. తవణంపల్లి మండలంలోని దిగువ తడకర గ్రామం నందు ఆమె మండల వైద్యాధికారి ప్రియాంకతో కలిసి పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం చిన్నారులకు జడ్పిటిసి భారతి మధు కుమార్ పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం రెడ్డి, ఎం ఎల్ హెచ్ పి, ఏఎన్ఎమ్ లు,ఆశ వర్కర్లు, పాల్గొన్నారు