మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:,ఏలేశ్వరం వినోద్ మిశ్రా నగర్లో షహీద్ భగత్ సింగ్,కామ్రేడ్ చారు మజుందార్ విగ్రహాల ఆవిష్కరణ సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కొసిరెడ్డి గణేశ్వరరావు,విప్లవ యువజన కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.భారతదేశ స్వాతంత్రం కోసం ఉరికంబాన్ని ముద్దాడిన షహీద్ భగత్ సింగ్ మరియు భూమికోసం,భుక్తి కోసం,విముక్తి కోసం అమరుడైన కామ్రేడ్ చారు మజుందార్ విగ్రహాలను మేలుకో ఆంధ్రప్రదేశ్ కో కన్వీనర్ రమేష్ పట్నాయక్,ఏపీ,ఒరిస్సా ఆదివాసి గిరిజన సంఘం అధ్యక్షులు చెండా భూషణం ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు.ముందుగా ఏలేశ్వరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి పలు రకాల గిరిజన నృత్యాలు,వివిధ రకాల సాంసృతిక కార్యక్రమాలతో భారీ ర్యాలీగా వినోద్ మిశ్రా నగర్ కి చేరికొని,ఆ మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించారు.అనంతరం చారు మజుందార్ భవనంలో మహాసభ నిర్వహించి గిరిజనుల కోసం ఇప్పటి వరకు చేసిన,భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలు గురించి వివరించారు.గిరిజనుల అభివృద్ధి కోసం పాటు పడుతూ అనేక కార్యక్రమాలు చేస్తున్న కొసిరెడ్డి గణేష్ ని సభా వేదికగా ముఖ్య అతిథులు అభినందించారు.ఈ కార్యక్రమంలో బహుజన పొలిటికల్ సెంటర్ నాయకులు సాదు మాల్యాద్రి,మహిళా సంఘం నాయకురాలు గంటేడి నాగమణి,కందుల కృపా ప్రసాద్,కందుల క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *