బంగారుపాళ్యం,మనధ్యాస, డిసెంబర్ 15
చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, బెంగళూరు చెన్నై జాతీయ రహదారి, కె.జి.సత్రం వద్ద కొండపై వెలసిన శ్రీపార్వతి సమేత సిద్దేశ్వరస్వామి వారి దర్శనానికి తమిళ కార్తీకనెల ఆఖరి సోమవారం కావడంతో శివుని భక్తులు పోటెత్తారు.స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసి అలంకరించిన తర్వాత భక్తులకుదర్శనమిచ్చారు. గ్రామస్తులు భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం అన్నదానం కార్యక్రమం చేపట్టారు.ఓం నమఃశివాయ నామస్మరణతో పరిసర ప్రాంతాలు మారుమొగాయి.