ఆక‌ట్టుకుంటున్న చియాన్ విక్ర‌మ్ ‘వీర ధీర సూర‌న్ పార్ట్ 2’ టీజ‌ర్‌..

Mana Cinema:- జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాల‌తో ప్రేక్ష‌కులను అల‌రించే న‌టుల్లో త‌మిళ స్టార్ హీరో చియాన్ విక్ర‌మ్ ముందుంటారు. ఇటీవ‌లే ఆయ‌న తంగ‌లాన్‌తో మంచి విజ‌యాన్ని అందుకున్నారు. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న మూవీ వీర ధీర సూర‌న్ . కాగా ఈ మూవీ రెండు భాగాలుగా తెర‌కెక్కుతోంది. మొద‌టగా రెండో భాగాన్ని విడుద‌ల చేస్తున్నారు. ‘చిన్నా’ ఫేమ్‌ ఎస్ యూ అరుణ్ కుమార్ దర్శకత్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది.హెచ్ఆర్‌. పిక్చ‌ర్స్ ప‌తాకంపై రియాశిబు ఈ మూవీని నిర్మిస్తున్నారు. నటి దుషారా విజయన్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఎస్‌జే.సూర్య, సురాజ్‌ వెంజరమూడు, సిద్ధిక్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్న ఈ చిత్రానికి జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.తాజాగా ఈ చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. నిడివి ఒక నిమిషం 47 సెక‌న్లు. ఎవ‌రైనా ఉన్నారా? అని ఓ మ‌హిళా ఓ షాపు ముందు నిల్చోని అంటుంది. అప్పుడు చేయి చూపిస్తూ విక్ర‌మ్ కొంచెం సెలెంట్‌గా ఉండండి పాప నిద్ర‌పోతుంది అని సైగ‌ల‌తో చెబుతాడు.ఈ చిత్రంలో విక్ర‌మ్ ఓ కిరాణా దుకాణాన్ని నిర్వ‌హిస్తూ త‌న కుటుంబాన్ని పోషించుకుంటాడ‌ని టీజ‌ర్ బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. ఆరంభంలో కుటుంబంపై ఉన్న ప్రేమ‌ను చూపించ‌గా ఆఖ‌రిలో యాక్ష‌న్ స‌న్నివేశాలు ఉన్నాయి. మొత్తంగా టీజ‌ర్ అదిరిపోయింది.

  • Related Posts

    మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారిక కు ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్ !!!

    Mana News, Mana Cinema :-తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో మెర్సీ కిల్లింగ్ సినిమాలో నటించిన బేబి హారికకు ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు కేటగిరిలో గద్దర్ అవార్డ్స్ వరించడం విశేషం. సాయి సిద్ధార్ద్…

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

    జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

    పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

    పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

    తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

    తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

    గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి, సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

    గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి,  సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

    ఐజ మునిసిపల్ ఇంజనీర్ రాజశేఖర్‌కు విధుల్లో పునర్నియామకం.నిర్లక్ష్య ఆరోపణలపై నిజానిజాలు నిరూపణతో సస్పెన్స్ రద్దు

    ఐజ మునిసిపల్ ఇంజనీర్ రాజశేఖర్‌కు విధుల్లో పునర్నియామకం.నిర్లక్ష్య ఆరోపణలపై నిజానిజాలు నిరూపణతో సస్పెన్స్ రద్దు

    జాగృతిని అన్ని జిల్లాలో విస్తరింపజేయాలి ఎమ్మెల్సీ కవిత – హైద్రాబాద్ లో వారి సగృహంలో మర్యాద పూర్వకంగా కలిసిన ఉద్యమకారులు

    జాగృతిని అన్ని జిల్లాలో విస్తరింపజేయాలి ఎమ్మెల్సీ కవిత – హైద్రాబాద్ లో వారి సగృహంలో మర్యాద పూర్వకంగా కలిసిన ఉద్యమకారులు