ప్రతి లబ్ధిదారునికి న్యాయం చేయడమే మా లక్ష్యం పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్పింఛన్ పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారుల కు స్వయంగా పెన్షన్ అందించిన ఎమ్మెల్యే కాకర్ల*
కలిగిరి,మన ధ్యాస న్యూస్ డిసెంబర్ 1, (కె నాగరాజు).

కలిగిరి మండలం గంగిరెడ్డిపాలెం గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం లో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ హాజరై, స్వయంగా లబ్ధిదారులకు పింఛన్ లను అందజేశారు.రాజాల రత్నమ్మ భర్తకు గతంలో ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ ఆయన మరణంతో నిలిచిపోయింది.కొత్తగా ప్రవేశపెట్టిన స్పౌస్ పింఛన్ పథకం కింద ఆమెకు ఆ పింఛన్‌ను కేటాయించగా, ఆ తొలి పింఛన్‌ను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా ఆమెకు అందించారు.అదే విధంగా వితంతు,వికలాంగ,వృద్ధాప్య తదితర అన్ని రకాల పెన్షన్లను ఎమ్మెల్యే స్వయంగా లబ్ధిదారులకు అందించి, ప్రభుత్వం అందించే సహాయాన్ని నేరుగా ప్రజల దాకా తీసుకువెళ్లే విధానాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేశారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింఛన్ మొత్తాన్ని పెంచి ప్రతి లబ్ధిదారుడికి అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.ఈ నిర్ణయం వేలాది కుటుంబాలకు ఆర్థికంగా గట్టి తోడ్పాటును అందించడమే కాక,ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని మరింత బలపరిచింది. ప్రతి పేదవాడిక,అవసరమైన ప్రతి వ్యక్తికి సహాయం అందేలా చూడటం తమ ప్రభుత్వ ధ్యేయమని, సామాజిక న్యాయం సాధనలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడుతుందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామ ప్రజలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు










