ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల..!

ప్రతి లబ్ధిదారునికి న్యాయం చేయడమే మా లక్ష్యం పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్పింఛన్ పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారుల కు స్వయంగా పెన్షన్ అందించిన ఎమ్మెల్యే కాకర్ల*

కలిగిరి,మన ధ్యాస న్యూస్ డిసెంబర్ 1, (కె నాగరాజు).

కలిగిరి మండలం గంగిరెడ్డిపాలెం గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం లో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ హాజరై, స్వయంగా లబ్ధిదారులకు పింఛన్ లను అందజేశారు.రాజాల రత్నమ్మ భర్తకు గతంలో ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ ఆయన మరణంతో నిలిచిపోయింది.కొత్తగా ప్రవేశపెట్టిన స్పౌస్ పింఛన్ పథకం కింద ఆమెకు ఆ పింఛన్‌ను కేటాయించగా, ఆ తొలి పింఛన్‌ను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా ఆమెకు అందించారు.అదే విధంగా వితంతు,వికలాంగ,వృద్ధాప్య తదితర అన్ని రకాల పెన్షన్లను ఎమ్మెల్యే స్వయంగా లబ్ధిదారులకు అందించి, ప్రభుత్వం అందించే సహాయాన్ని నేరుగా ప్రజల దాకా తీసుకువెళ్లే విధానాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేశారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింఛన్ మొత్తాన్ని పెంచి ప్రతి లబ్ధిదారుడికి అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.ఈ నిర్ణయం వేలాది కుటుంబాలకు ఆర్థికంగా గట్టి తోడ్పాటును అందించడమే కాక,ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని మరింత బలపరిచింది. ప్రతి పేదవాడిక,అవసరమైన ప్రతి వ్యక్తికి సహాయం అందేలా చూడటం తమ ప్రభుత్వ ధ్యేయమని, సామాజిక న్యాయం సాధనలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడుతుందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామ ప్రజలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

  • Related Posts

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    గోసాల మల్లికార్జున కుటుంబ సభ్యుల ను పరామర్శించిన కలిగిరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణరెడ్డి. కలిగిరి,మనధ్యాసన్యూస్, డిసెంబర్ 7, (కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం కలిగిరి గ్రామపంచాయతీ నందు జిరావారిపాలెం గ్రామానికి చెందిన గోసాల…

    ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..

    కావలి,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 06,(కె నాగరాజు) అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు. శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం