యాదమరి నవంబర్ 30 మన ద్యాస
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం డీకే చెరువు పంచాయితీ పరిధిలో గుడ్డివాని చెరువులో సుమారు 30 సంవత్సరాల వయసుగల ఏనుగు చెరువులు దురదలో చిక్కు కున్నది స్థానికుల సమాచారం మేరకు యాదమరి ఫారెస్ట్ సిబ్బంది పోలీస్ సిబ్బంది పలమనేరు ఫారెస్ట్ సిబ్బంది వెటర్నరీ డాక్టర్లు ట్రైనీగ్ ఏనుగులు సహాయంతో సురక్షితంగా పైకి లాగి వారి క్రేన్ తో లారీకి ఎక్కించి తిరుపతి జూపార్క్ తరలించారు గత రెండు నెలలు క్రితం ఇదే ఏనుగు తమిళనాడు ఫారెస్ట్ లో కాలికి గాయం అయింది అప్పటినుండి తమిళనాడు ఆంధ్ర సరిహద్దులు డీకే చెరువు ప్రాంతంలో తిరుగుతూ ఈ కారణంగానే బురదలో చిక్కుకోవడమైనది ఈ కార్యక్రమంలో తిరుపతి ఫారెస్ట్ అధికారులు పలమనేరు ఫారెస్ట్ అధికారులు చిత్తూరు అధికారులు యాదమరి రెవెన్యూ అధికారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు







