మన ధ్యాస ,బుచ్చిరెడ్డిపాలెం, నవంబర్ 25:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజావసరాలు గుర్తించి పాలన చేసే పాలకుడన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో పక్కా ఇళ్ల నిర్మాణానికి ఎంపికయిన లబ్ది దారులకు ఆమె మంజూరు పత్రాలను అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పేదల సొంత ఇంటి కల నెరవేర్చే కార్యక్రమంలో పాల్గొనడం పట్ల సంతోషం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. నాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు నుంచి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు యువ నాయకులు మంత్రి లోకేష్ వరకు ప్రతి ఒక్కరికి కూడు, గుడ్డ, నీడ కల్పించడమే తెలుగుదేశం పార్టీవిధానమన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాక హౌసింగ్ అధికారులతో నిర్వహించినన్ని సమీక్షా సమావేశాలు మరే శాఖ అధికారులతో నిర్వహించలేదన్నారు. తాను ఎన్నికల సందర్భంగా ఎక్కడికెళ్లినా నాడు ఎన్టీఆర్ హయాంలోనే.. చంద్రబాబు నాయుడు గారి హయాలోనే కట్టిన ఇళ్లనే చూశానన్నారు. పగుళ్లు బారిన పాత ఇళ్లను మరమ్మత్తులకు చూపించేందుకు ఈ సందర్భంగా కృషి చేస్తానన్నారు. బుచ్చిరెడ్డి పాళెం పట్టణ పరిధిలో సొంత స్థలం వున్న 285 మందికి తొలి విడతగా పక్కా గృహాల లబ్దిదారులగా ఎంపిక చేసామని, పక్కా ఇళ్ల నిర్మాణానికి లబ్దిదారులకు ప్రభుత్వం ద్వారా 2 లక్షల 50 వేలు ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నామన్నారు. సొంత ఇళ్ళు , ఇంటి స్థలాలు లేని ప్రతి ఒక్కరు పి ఎం ఏ వై సర్వే లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేసారు. ఇళ్ళు లేదా ఇంటి స్థలాలు కావాల్సిన వారు కూడా సమీప సచివాలలయాలలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అన్ని మండలాల ఎంపీడీవోలు, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఇళ్ళు లేదా ఇంటి స్థలాల నమోదుపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. రాష్టంలో ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. గత ప్రభుత్వ తప్పిదాల కారణంగా పేదలకు ఇంటి స్థలాల పంపిణిలో జాప్యం జరిగిందన్నారు. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ళు లేదా ఇంటి స్థలం మంజూరు చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి హామి యిచ్చారు. స్థానిక తహసీల్దారు అంబటి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమీషనర్ డి బాలకృష్ణ, హౌసింగ్ ఎఇ పెంచలయ్య, మున్సిపల్ చైర్మన్ మోర్ల సుప్రజ ,వవ్వేరు బ్యాంకు చైర్మన్ విజయలక్ష్మి, మండల అధ్యక్షులు గుత్తా శీనయ్య , మాజీ మండల అధ్యక్షులు ఎంవి శేషయ్య , బత్తల హరికృష్ణ , వైస్ చైర్మన్లు, నగర పార్టీ కౌన్సిలర్లు, మండల క్లస్టర్, యూనిట్ మరియు బూత్ కన్వీనర్లు, బీజేపీ మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *